యుద్దకాండం
హనుమంతుడు సీతను గురించిన విషయాలు చెప్పగానే శ్రీరాముడు హనుమను గడలింగనం చేసుకున్నాడు. లంకను వానరసైన్య సమేతంగా చేరుకోవడానికి వారధిని కట్టేందుకు నిర్ణయించుకున్నారు.
లంకలో కూడా యుద్ధ భేరి మోగింది. సైన్యాన్ని సమాయత్త పరచాడు రావణుడు. విభీషణుడు సీతాదేవిని రామునికి తిరిగి అప్పగించి, శరణు వేడాల్సిందిగా రావణాసురుని సూచించాడు.కుంభకర్ణుడు కూడా రావణుడిని తప్పుబట్టారు. విభీషణుడు ధర్మమార్గాన్ని అనుసరించి,శ్రీరాముడిని శరణు జొచ్చెన్దుకు సిద్దంకాగా, కుంభకర్ణుడు రాముణ్ణి వాదించే భాద్యతను తనపై వేసుకున్నాను.
ఆకాశంలో నిలిచి రాముడిని శరణు వేడాడు విభీషణుడు. దాశరథి అనుగ్రహించాడు. విభీషణుడినే లంకకు రాజుగా చేస్తానని మాట ఇచ్చాడు శ్రీరాముడు.
సముద్రుడికోసం ప్రార్ధించాడు శ్రీరాముడు. సముద్రుడు అహంకారంతో దర్శనమీయకపోవడంతో బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు రాముడు. దీనితో భయకంపితుడైన సముద్రుడు దారికి వచ్చాడు.అయితే, ఎక్కువపెట్టిన అస్త్రం వృధాకాకూడదు కాబట్టి పాపాత్ములు, దోపిడీదారులు ఉండే 'ద్రుమ కుల్యం'పై బాణాన్ని సందించామన్నాడు సముద్రుడు.
విశ్వకర్మ కుమారుడైన 'నలుడు సేతువును నిర్మించాడు.సెవుతును దాటి వానర సైన్యం లంకకు వెళుతుంటే, వారి ఉత్సహానికి సముద్రం మౌనం దాల్చినట్లుగా మారింది. శుక సారణులనే రావణమంత్రులు శ్రీరాముడు బలాన్ని తెలుసుకునేందుకు వానర రూపాలతో వస్తే వారిని పట్టి ఇచ్చాడు.విభీషణుడు.రాముడు సైన్యంతో సువేల పర్వతానికి చేరాడు. అక్కడినుండి ఠీవిగా కూర్చున్న రావణుడిని చూశాడు.కోపం పట్టలేని సుగ్రీవుడు ఒక్క ఉదుటున రావణుడి చెంతకు లంఘించి, ముష్టి యుద్ధం చేసి, ముప్పుతిప్పలు పెట్టి, మల్లి సువేల పర్వతాన్ని చేరుకున్నాడు.
రాముడు రావణుడి దగ్గరకు అంగదుడిగా రాయబారిగా పంపాడు.నలుగురు రాక్షసులు అతనిమీద పాడగా, వారిని సంహరించి రాముడిని చేరాడు అంగదుడు. యుద్ధం తప్పదని రాముడికి తెలిసిపోయింది.యుద్ధం ప్రారంభమైంది.రావణుని కుమారుడైన ఇంద్రజిత్తు అంగదుని చేతిలో ఓడిపోయాడు.దీనికి కోపించి రామ లక్మనులపై నాగాస్త్రాన్ని సంధించాడు.అది రామ లక్మనులను మూర్చిల్ల చేసింది. వారు మరణించారన్న రావణుడు దానిని సీతకు చూపించమని ఆదేశించాడు. వారు నిజంగానే మరణించారేమోనని భావించిన సీత కన్నీరు మున్నీరయింది. త్రిజట అనే రాక్షసి ఆమెను ఓదార్చి, అది రాక్షస మాయెనని తెలిపింది.గరుత్మంతుని రాకతో నాగాస్త్ర ప్రభావం చెల్లాచెదురైంది.రామలక్ష్మణులు మేల్కొని మల్లి యుద్దాన్ని ప్రారంభించారు.రావణుడు తీవ్రంగా యుద్ధం చేశాడు.రావణుడు ప్రయోగించిన 'శక్తి' అనే అస్త్రం లక్ష్మణుడి ఎదలో నాటుకుంది.దీనిని గమనించిన మారుతీ రావణుడిని ముష్టి ఘాతాలతో కుమ్మి వేశాడు.హనుమంతుని భుజాలపై ఎక్కి యుద్ధం చేశాడు రాముడు.రాముని ధాటికి రావణుడి కిరీటము, ధనుస్సు నేలరాలాయి. 'యుద్ధంలో అలసిపోయావు.సేద దీర్చుకొని రేపు రా' అని రావణుడిని వెళ్ళమన్నాడు శ్రీరాముడు. అవమానభారంతో లంకకు చేరిన రావణుడు కుంభకర్ణుడిని నిద్ర మేల్కొలిపాడు.కుంభకర్ణుడు వానరులను చావుదెబ్బ తీశాడు.దీనితో రాముడు 'ఇంద్రాస్త్రం' తో రాక్షసుని తల తెగ నరికాడు.అప్పుడు ఇంద్రజిత్తు యుద్ధం ప్రారంభించి బ్రహ్మస్త్రంతో రామలక్ష్మణులను మూర్చిల్ల జేశాడు.జాంబవంతుని ఆజ్ఞ మేరకు హనుమ హిమాలయ పర్వతాలకు వెళ్లి అక్కడి 'సర్వోఉషాది' మహాపర్వతాన్ని పెకిలించుకు వచ్చాడు.ఓషధుల వాసనతోనే రామలక్ష్మణులు లేచి కూర్చున్నారు. మరణించిన వానరులంతా తిరిగి బతికారు.సుగ్రీవుని ఆజ్ఞ మేరకు లంకకు నిప్పు పెట్టారు.
ఇంద్రజిత్తు, అందరి సమక్షంలో సీతను సంహరించగా,అది మాయ సీతేనని తెలిపాడు విభీషణుడు. చివరకు ఇంద్రజిత్తు లక్ష్మణుడి చేతిలో మరణించాడు. ఇది చుసిన రావణుడు ప్రళయకాల రుద్రుడిలా విజృంభించాడు.లక్ష్మణుడిపైకి శక్తి అస్త్రాన్ని సంధించాడు.దీనితో రావణుడిని ప్రత్యక్ష యుద్దని ప్రారంభించాడు దాశరథి. శ్రీరాముడి విలువిద్యా పాండిత్యానికి తట్టుకోలేని రావణుడు భయంతో పరుగులు తీస్తాడు.
ఇంద్రుడు పంపగా ఇంద్రుని సారథి 'మాతలి' దివ్య రథంతో శ్రీరాముడి వద్దకు వచ్చాడు. పుష్పక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు సీతారామలక్ష్మణులు. శ్రీరాముడు రాజుగా, భరతుడు యువరాజుగా జనరంజకమైన పాలనను సాగించారు.
0 Doubts's