Home SSC 10th Class తెలుగు ( 10 వ తరగతి )

అరణ్యకాండం

అరణ్యకాండం

దండకారణ్యం ప్రశాంతమైన ప్రదేశం.మునులు తపస్సు చేసుకునే ఆశ్రమం. అక్కడ వీరత్వంతో పనిలేదని భావించిన శ్రీరాముడు ధనుస్సు నుండి అల్లే త్రాడును వేరుచేశాడు. అక్కడనుండి బయలుదేరుతుండగా విరాధుడనే రాక్షసుడు రామలక్ష్మణులపైకి దాడిచేసి వారిని అపహరించే యత్నం చేశాడు.విరాధుని భుజాలను నరికివేసి, చంపేందుకు సిద్ధపడ్డారు రామలక్ష్మణులు.విరాధుడు తను తుంబురుడనే గంధర్వుడనని, కుబేరుని శాపంవల్ల రాక్షసునిగా మారానని, రామునివల్ల తనకు శాప విమోచనం కలిగిందని తెలుసుకున్నాడు.తనను గోతిలో పూడ్చమని చెప్పి, వారిని శరభంగా మహర్షిని దర్శించుకొమ్మని చెప్పాడు విరాధుడు. శరభంగా మహర్షి తన తపఃఫలాన్నంతా శ్రీరామునికి ధారపోసాడు. అక్కడి మణులు రాక్షసులవల్ల తమకు కలుగుతున్న బాధలను తెలిపి, వారిని సంహరించామని కోరుకున్నారు.అటుతర్వాత మహర్షి కూడా తన తపఃశక్తినంత రామునికి ధారపోసాడు. అగస్త్య మహర్షిని కలుసుకునే మార్గం తెలిపాడు. అగస్త్యుడు తపఃసంపన్నుడు. విద్య పర్వతపు గర్వాన్ని అణచినవాడు. అయన శ్రీరామునికి దివ్యధనుస్సును, అక్షయ తూణీరాలను, ఆమెఘమైన ఖడ్గాన్ని బహూకరించాడు.'పంచవటి' అనే ప్రదేశంలో వారిని నివసించాల్సిందిగా సూచించాడు.

పంచవటిలో రావణుని చెల్లెలు శూర్పణఖ వచ్చి, రాముడిని, లక్ష్మణుడిని మోహించింది. సీతపైకి దాడిచేయగా, లక్ష్మణుడు శూర్పనఖ ముక్కు చెవులు కోశాడు. దానితో ఆమె తన సోదరుడైన ఖరుని వద్దకు వెళ్ళింది.ఖరుడు, దూషణుడు 14000 మంది సైన్యంతో శ్రీరామునిపై దాడి చేయగా, వారందరిని సంహరించాడు శ్రీరాముడు. ఈ విషయాన్నీ రావణాసురుడికి అతని గూఢచారి అయిన అకంపనుడు తెలిపాడు. దీనితో శ్రీరాముడిని సంహరిస్తానని ఆవేశపడ్డాడు రావణుడు. ఐతే, తన భార్య అయిన సీతను అపహరిస్తే రాముడు బాధతో తనువు చలిస్తాడని,శ్రీరాముడిని యుద్ధంలో జయించడం సాధ్యంకాదని తెలుసుకొని, ఆ ప్రయత్నం ప్రారంభిస్తాడు.మారీచుడిని తన పనిలో సహకరించమని కోరతాడు. మారీచుడు అది సరైందికాదని నచ్చజెబుతాడు.తనకు కలిగిన అవమానాన్ని, జరిగిన రాక్షస సంహారాన్ని చూసి తట్టుకోలేని శూర్పణఖ రావణుడి వద్దకు పరిగెత్తుకు వెళ్ళింది.సీతకు తగిన భర్తవు నివేనని ఆశలు రేకెత్తించింది. చెల్లెలి వికృతి రూపాన్ని, చెల్లెలు చిగుర్చిన ఆశలను ఆసరాగా చేసుకొని రావణుడు మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించాడు.మళ్లీ మారీచుని వద్దకు వెళ్లి సీతాపహరణానికి సహకరించమని కోరాడు. మారీచునికి రామబాణం వాడి తెలుసు. అందుకే వద్దని వారించాడు.తనకు సహకరించుకుంటే చంపేస్తానని రావణుడు బెదిరించడంతో చివరికి అంగీకరించాడు.బంగారు లేడీగా మారి సీతారామ ఆశ్రమ ప్రదేశంలో తిరుగాడాడు. దానిని చూసి సీత ముచ్చటపడింది. వచ్చింది మారీచుడేకాని లేడి కాదంటాడు లక్ష్మణుడు. అయిన, సీత ఆ లేడి కావాలని కోరడంతో, తను మాయ లేడిని తీసుకొని వస్తానని, సీతకు జటాయువు అనే పక్షి రాజుతో బాటుగా రక్షణగా ఉండమని లక్ష్మణుడికి చెప్పి వెళతాడు శ్రీరాముడు.

ఇంతకు చేతికి చిక్కని మాయలేడిపైకి బాణాన్ని సంధించాడు రాముడు. దీనితో మారీచుడు తన రాక్షస స్వరూపాన్ని పొంది,శ్రీరాముడిని అనుకరిస్తూ, 'అయ్యో! సీత! అయ్యో! లక్ష్మణ!' అని అరుస్తూ ప్రాణాలు విడిచాడు. సీత దీనిని శ్రీరాముని గొంతుగానే భావించి, శ్రీరాముడు ఆపదలో వున్నదని భావించి, లక్ష్మణుడిని వెళ్ళమంటుంది. లక్ష్మణుడు అది మారీచుని గొంతేనని తెలిపినా, సీత అంగీకరించదు. లక్ష్మణుడిని అనుమానిస్తుంది. దీనితో, ఏమాత్రం మనసు ఒప్పుకోకపోయినా,సీతను వదలి వెళతాడు లక్ష్మణుడు.లక్ష్మణుడు వెళ్లగానే రావణుడు సన్యాసి రూపంలో సీత ముందుకు వస్తాడు. అతనిని సన్యాసిగానే భావించి సత్కారాలు చేస్తుంది.సీత రావణుడు తన నిజస్వరూపాన్ని ప్రదమర్శించి సీతను తన రథంలో లొంక నగరానికి అపహరించుకు వెళ్ళాడు. సీత ఆర్తనాదాలు అరణ్య రోదనలుగా మిగిలిపోయాయి. దీనిని గమనించాడు జటాయువు. రావణుణ్ణి ఎదిరించి, ప్రాణం విడిచాడు.ఆకాశ వీధిలో వెళుతుండగా, వానరులను చూసింది సీత.ఉత్తరియుపు కొంగులో తన ఆభరణాలను కొన్నిటిని ముఠా గట్టి వదిలింది.శ్రీరాముడు వారిని చూస్తే వారు తన జడ చెబుతారని ఆమె ఆశ!

రావణుడు సీతను లంకకు చేర్చాడు.పరిపరి విధాలుగా నచ్చజెప్పాడు.అంగీకరించకుంటే పన్నెండు నెలల తరువాత ఆమెను ఆహారంగా స్వీకరిస్తానని బెదిరించాడు. అశోక వనంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య సీతను నిర్బంధించాడు.

తిరిగి వచ్చిన రామ లక్ష్మణులకు సీత కనిపించలేదు.కన్నీరు మున్నీరుగా విలపించారు రామ లక్ష్మణులు.దారిలో కనిపించిన జటాయువు జరిగిన విషయాన్నీ చెప్పి మరణించాడు.అతనిని పితృసమానుడిగా భావించిన రాముడు ఆయనకు దహాస సంస్కారాలను నిర్వహించాడు.అటునుండి క్రౌంచామనే అరణ్యానికి చేరుకున్నారు రామ లక్ష్మణులు.పంపా సరస్సు ప్రాంతంలో శబరీ రామునికి తన ఆతిధ్యమిస్తుంది.శ్రీరాముని అనుమతి పొంది దేహాన్ని చలిస్తుంది. అక్కడినుండి రుష్యమూక పర్వతానికి చేరుకున్నారు రామ లక్ష్మణులు.