Home SSC 10th Class తెలుగు ( 10 వ తరగతి )

కిష్కిందకాండం

కిష్కిందకాండం

ఎంతో సుందరమైన పంపా సరోవర ప్రాంతం కూడా సీత వియోగ వేదనలో ఉన్నందున రామునికి ఆహ్లాదాన్ని అందించలేకపోయింది.ఉత్సాహమే బలం అంటూ లక్ష్మణుడు దైర్యం నూరిపోశారు.ఋష్యమూక పర్వతంపైన కనిపించిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు తన అన్న వారిని తనపైకి పంపాడేమోనని భయపడి విషయం కనుగొని రమ్మని ఆంజనేయస్వామిని పంపాడు.హనుమంతుడు సన్యాసి రూపంలో వెళ్లి రామలక్ష్మణులను కలిసి మృదుభాషణతో విషయాలను కనుగొన్నాడు.తొలి పరిచయంలోనే ఆకట్టుకున్నాడు ఆంజనేయుడు. సుగ్రీవుని వద్దకు వారిని తీసుకెళ్లాడు.సుగ్రీవుడు, రామలక్ష్మణులు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు.సుగ్రీవుడి భార్య రుమా ను అతని అన్న వాలి అపహరించి, సుగ్రీవుడిని రాజ్యంనుండి వెళ్ళగొడతాడు. వాలిని చంపడానికి రాముడు సహాయం చేస్తానన్నాడు. సీతాన్వేషణకు సుగ్రీవుడు సాయం చేస్తానన్నాడు.

వాలిని చంపేందుకు ముహూర్తం సిద్ధమైంది. యుద్దానికి వచ్చాడు వాలి.వాలి సుగ్రీవులిద్దరు ఒకే పోలికతో ఉండడం వల్ల మొదట వాలి వధ సాధ్యం కాలేదు. వాలి పరాక్రమానికి తట్టుకోలేని సుగ్రీవుడు ఋష్యమూక పర్వతానికి పరుగు తీశాడు.సుగ్రీవుడిని గుర్తించడానికి 'నాగకేసరపు లత'ను మేడలో వేశాడు శ్రీరాముడు.సుగ్రీవుడు మళ్లీ వాలిని యుద్దానికి వెళ్లవద్దని వాలి భార్య తార వరించింది.అయిన వినకుండా యుద్దానికి వెళ్ళాడు వాలి.

విష సర్పంతో సమానమైన బాణంతో వాలిని వధించాడు రాముడు. వధించేముందు వాలి తప్పేమిటో తెలియజెప్పాడు. వాలి మెడలోని దివ్యమాలను వాలి సుగ్రీవునికి ఇస్తూ, తన కొడుకైన అంగదుడికి హితోపదేశం చేస్తాడు. సుగ్రీవుడు కిష్కింద రాజ్యానికి రాజుగా, అంగదుడు యువరాజుగా అభిషిక్తులవుతారు.రాముడు ప్రసనవగిరి మీద ఉండిపోతాడు. సుగ్రీవుని మంత్రి నీలుడు సైన్య సమీకరణ చేస్తాడు.సుగ్రీవాజ్ఞ తిరుగలేనిది.అందువల్ల సైన్యమంతా వచ్చి చేరింది.వివిధ దిక్కులకు సీతాన్వేషణకోసం వనరుల్ని పంపాడు సుగ్రీవుడు.తూర్పు దిక్కునకు 'వినతుని' నాయకత్వంలో, దక్షిణ దిక్కుకు 'అంగదుని' నాయకత్వంలో, 'సుషేణుని' నాయకత్వంలో పశ్చిమానికి, 'శతబలి' నాయకత్వంలో ఉత్తరానికి సేనలను  పంపాడు. అంగదునితో బాటుగా ఆంజనేయుడిని దక్షణ దిక్కుగా పంపాడు.శ్రీరాముడు కూడా తన అంగుళీయకాన్ని హనుమంతుడికి అందించాడు.సీతను చూసినప్పుడు దాన్ని గుర్తిస్తుందని రాముని నమ్మకం. దక్షిణం వైపున వెళ్లిన వారు మినహాయిస్తే మిగతా వానర యోధులంతా రిక్త హస్తాలతో తిరిగి వచ్చారు.అంగదాదులు 'ఋక్షబిలాము' అనే గుహవద్దకు చేరుకుని, అక్కడ 'స్వయంప్రభ' అనే యోగిని అనుగ్రహంతో ఆకలి దప్పులను తీర్చుకున్నారు.ఆమె తపఃప్రభావంతో మహోదధి అనే మహాసముద్రాన్ని చేరుకున్నారు.సముద్ర తీరంలో 'సంపాతి' అనే పక్షి కనిపించదు.అయన జటాయువు సోదరుడు.సంపాతి సీతాదేవి ఎక్కడ ఉందొ కళ్లకు కట్టినట్టుగా తెలిపాడు. జాంబవంతుని ప్రోత్సహంతో హనుమంతుడు సముద్రాన్ని లంఘించడానికి సిద్దమయ్యాడు.అందుకు మహేంద్రగిరి ప్రాంతాన్ని అనువైనదిగా ఎంచుకున్నాడు.