అయోధ్యకాండం
దశరథునికి తన నలుగురు కుమారులపై ఎంతో ప్రేమాభిమానాలున్నా, వారిలో శ్రీరామునిపై మరి ఎక్కువ. సకల గుణాలు మూర్తీభవించిన శ్రీరాముడంటే దశరథునికే కాదు, ప్రజలందరికి ప్రీతి! అందువల్ల తను జీవించాయి ఉండగానే శ్రీరాముడు రాజేతై బాగుండుననుకున్నాడు దశరథుడు. అందరు దీనికి హర్షామోదాన్నని తెలిపారు. దీనితో శ్రీరాముడి యువరాజ్య పట్టాభిషేకానికి ముహుర్తాన్ని సిద్ధం చేశారు.శ్రీరాముడికి రాజనీతి ధర్మాలను బోధించాడు దశరథుడు. తల్లి కౌశల్య ఆశీస్సులకోసం వచ్చాడు శ్రీరాముడు. వశిష్టుని ఆదేశం మేరకు సీతారాములు ఉపవాస దీక్షను చేపట్టారు.
శ్రీరామ పట్టాభిషేకానికి అయోధ్య అందంగా అలంకరించుకుంది.ఇది మందరకు నచ్చలేదు.మంధర కైకేయి దాసి.మందార కైకేయికి శ్రీరామ పట్టాభిషేక వార్తను చెప్పగానే కైకేయి ఎంతో సంతోషించింది.అయితే మందరచేప్పుడు మాటలతో కైకేయి మనసు మారుతుంది.దీనితో కైకేయి రామ పట్టాభిషేకాన్ని అలాగైనా ఆపాలనుకుంటుంది.అంతకుముందు దశరథుడు కైకేయికి వరాలు ఇస్తాడు.వాటిని అవసరమున్నప్పుడు ఉపయోగించుకుంటానంటుంది కైకేయి.ప్రస్తుతం ఆ వరాలను ఉపయోగించదలుచుకుంటుంది.దశరథుడు రాగానే శ్రీరాముడు వనవాసానికి వెళ్లడం, భరతుడికి పట్టాభిషేకం చేయడం అనే వారలు కావాలంటుంది.రాముడిని ప్రాణంతో సమనగాచూసే దశరథుడు ఈ మాటలు విని మూర్చపోయాడు. ఈ కోరిక కలో నిజమో తేల్చుకునే యత్నం చేశాడు.నిజమేనని తేలిన పిదప మరేదైనా కోరిక కోరుకొమ్మని కైకేయిని మరీమరీ ప్రాధేయపడ్డాడు.కైకేయి ఆ వరాలు తప్పితే మరేదే కోరుకోనంటుంది.తక్షణం రాముడు నారచీరలు కట్టి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలనీ, భరతుడు అతనికి బదులుగా పట్టాభిషిక్తుడు కావాలని ఒత్తిడి చేసింది కైకేయి. దశరథుడు తల్లిడిల్లిపోయాడు. కైకేయి పాదాల్ని కన్నీటితో కడిగాడు. ఐనా కైకేయి మనసు మారలేదు.ఇచ్చిన మాట తప్పలేక, రాముడిని అరణ్యాలకు పంపలేక కొట్టుమిట్టాడాడు.సుమంత్రుడు రాముడిని తీసుకువచ్చాడు. వరాల గురించి రామునికి చెప్పింది కైకేయి. ఏ మాత్రం సంకోచించకుండా రాజ్యాన్ని తృణ ప్రాయంగా వదలి, అడవులకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు శ్రీరాముడు.దండకారణ్యానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు.ఇది గమనించిన దశరథుడు బాధతో స్పృహ కోల్పోయాడు.విధి ప్రేరణ వల్లే కైకేయి అలంటి వరాలు కోరిందని తెలిసి, కౌసల్యను, లక్ష్మణుడిని ఊరడించాడు రాముడు. కౌసల్య రాముడిని సన్మార్గంలో నడవమని ఆశీర్వదించింది. సేవ చేసుకునేందుకు తనవెంట రావడానికి ఒప్పుకోవలసిందిగా ప్రాధేయపడ్డాడు లక్ష్మణుడు. రాముడు అంగీకరించాడు. సీతకూడా రాముని వెంట బయలుదేరింది.సీతారామలక్ష్మణులు సుమత్రుడి రథంలో వనవాసానికి బయలుదేరగా అయోధ్య యావత్తు కన్నీళ్లు పట్టుకొని, వారివెంట తరలి వచ్చింది. అయోధ్య వాసులందరు గాఢనిద్రలో ఉండగా, సీతారామలక్ష్మణులు తామస నది తీరాన్ని దాటారు.చివరకు వారు గంగానదికి చేరారు.ఆ తీరంలో శృంగిబేరపురం ఉంది. దాని రాజు గుహుడు. గుహుడు ఆనాడు శ్రీరామునికి ఆతిధ్యమిచ్చి, మరుసటిరోజు సాగనంపాడు. భరద్వాజ మహాముని సూచనలమేరకు చిత్రకూట పర్వతం చేరుకున్నారు సీతారామలక్ష్మణులు.లక్ష్మణుడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు.
ఈ విషయాలన్నీ దశరథునికి తెలియవచ్చాయి. పుత్రివియోగ బాధతో ప్రాణాలు విడిచాడు దశరథుడు. తిరిగి వచ్చిన భరతుడు తండ్రి అంత్యక్రియలను నిర్వహించాడు.భరద్వాజుడి నుండి సెలవు తీసుకొని రాముని వద్దకు ప్రయాణమైనాడు భరతుడు. లక్ష్మణుడు కూడా సైన్యంతో వస్తున్న భరతుడిని అనుమానించాడు.భరతుడిని అనుమానించడం సరికాదన్నారు రాముడు. రాముడిని చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేక పాదాలపై బడ్డారు భరత శత్రుఘ్నులు. తండ్రి మరణవార్తను చెప్పారు.రాముడు దుఃఖించాడు. తిరిగి రాజ్యానికి రమ్మని అభ్యర్దించాడు. అక్కడే ఉన్న జాబాలి మహర్షి కూడా రాముడి రాజ్యానికి తిరిగివెళ్లమని నచ్చజెప్పాడు. రాముడు తిరస్కరించాడు.తనకు బదులుగా భరతునికి తన పాదుకలను అప్పగించాడు రాముడు.భరతుడు కూడా అయోధ్య నగరం వెలుపలే ఉండి 14 సంవత్సరాల నారచీరలు కట్టి అరణ్యవాసంలాగే గడుపుతానన్నాడు.శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం చేసి రాముని పేరుమీదే పాలన సాగించాడు.
శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు.అత్రి మహాముని భార్య అనసూయ సీతకు దివ్య వజ్రాభరణాలిచ్చింది. అటుపై వారు దండకారణ్యానికి ప్రయాణం ప్రారంభించారు.
0 Doubts's