Home SSC 10th Class తెలుగు ( 10 వ తరగతి )

బాలకాండం

బాలకాండం

నిరంతరం హరినామస్మరణ చేసే మహాభక్తుడు నారదుడు. అయన ఒకరోజు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు వాల్మీకి,"ఈ ప్రపంచంలో సకల సద్గుణ సంపన్నుడైన వ్యక్తి ఎవరైనా వున్నారా"! అని ప్రశ్నించగా, నారదుడు శ్రీరాముడు అలంటి సకల సుగుణాభిరాముడని తెలిపి,రామకథను వినిపిస్తాడు.ఈ కథ వాల్మీకి మనసుకు హత్తుకుంది.

ఇలా ఉండగా ఒకనాడు తమసా నదికి స్నానానికి వెళ్లిన వాల్మీకి మహర్షికి ఒక ముచ్చటైన పక్షుల జంట కనిపించింది.ఇంతలో ఒక వేటగాడు బాణంతో ఆ జంటలోని మగ పక్షిని నేలకూల్చగా, ఆడపక్షి బాధతో తల్లడిల్లింది.ఈ బాధను చూసి చలించిన వాల్మీకి మహర్షి నోటినుండి అప్రయత్నాంగా శ్లోకంగా మారింది. ఈ విధంగా పక్షి జంట శోకం నుండి రామాయణ శ్లోకం ఆవిర్భవించింది.

ఈ బాధ వాల్మీకి మనసును దహిస్తూనే ఉంది. ఇంతలో అయన దగ్గరికి వచ్చాడు బ్రహ్మ. అయన తన సంకల్ప ప్రభావం వల్లే వాల్మీకి నోటినుండి శ్లోకం వచ్చిందని, కలకాలం నిలిచేలా రామాయణాన్ని రచించమని సెలవిచ్చాడు.దింతో రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి.

అయోధ్య నగరం : అయోధ్య అంటే 'యోధులకు జయింప శక్యం కానిది' అని అర్ధం ఈ నగరం కోసల దేశపు ముఖ్య పట్టణం.దీనికి రాజు దశరథుడు.మహావీరుడు,ధర్మవర్తనుడు.ఐనా సంతానం లేకపోవడంతో సంతాన ప్రాప్తికోసం 'పుత్రకామేష్టి' యజ్ఞాన్ని చేశాడు.ఇదే సమయంలో దేవతలు రావణాసురుడి అకృత్యాలను బ్రహ్మ దేవుడికి మొరపెట్టుకున్నారు.రావణుడు మానవుల వల్ల తప్పితే మరెవ్వరివల్ల మరణం లేని వరాన్ని బ్రహ్మ నుండే పొందాడు.దేవతలందరు రావణుడిని సంహరించడానికి మానవుడిగా అవతరించామని విష్ణుమూర్తిని కోరారు.దశరథుడి నలుగురు కుమారులుగా అవతరించామని ప్రార్ధించారు.విష్ణువు అందుకు అంగీకరించాడు.దశరథుడి యజ్ఞగుండం నుండి ఆవిర్భవించిన దివ్య పురుషుడు దశరథుడికి పాయసాన్ని అందించాడు.ఆ దివ్య పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు పంచడంతో సంతాన ప్రాప్తి కలిగింది.

కౌసల్యకు శ్రీరాముడు,

కైకేయికి భరతుడు,

సుమిత్రకు లక్ష్మణుడు,శత్రజ్ఞుడు  జన్మించారు.నలుగురు అన్యోన్యానురాగాలతో సకల శాస్త్ర విద్యా పారంగతులైనారు.కొంతకాలం తర్వాత దశరథుని దగ్గరకు వచ్చాడు విశ్వమిత్ర ఋషి. అయన సృష్టికి ప్రతిసృష్టి చేయగల మహా తపశ్శాలి.తన యాగాన్ని రాక్షసులు భంగం చేస్తున్నారని, వారిని అంతం చేయడానికి రామలక్ష్మణులను పంపించమని కోరతాడు విశ్వమిత్రుడు.ముక్కుపచ్చలారని పసిబాలలను రాక్షసులపై యుద్దానికి పంపడానికి దశరథుడు అంగీకరించడు.దానితో విశ్వమిత్రుడు కోపిస్తాడు.విశ్వమిత్రుడితో పంపుతాడు దశరథుడు.

వారిని తనవెంట తీసుకెళ్లిన విశ్వమిత్రుడు సరయు నది తీరంలో రామలక్ష్మణులకు అతిబల, మహాబల అనే విద్యలను ఉపదేశిస్తాడు.ఈ విద్యాలవల్ల అలసట, ఆకలిదప్పులు దరిచేరవు.ప్రయాణం కొనసాగుతుండగా 'మరల', 'కరుష' అనే ప్రాంతాలకు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని 'తాటక' అనే రాక్షసి, ఆమె కుమారుడు ' మారీచుడు'అతలాకుతలం చేస్తున్నారు.గురువు ఆదేశాన్ని పాటించి,తటాకాని నేలకూల్చాడు శ్రీరాముడు దింతో రాక్షస సంహారం ప్రారంమైంది. మారీచ,సుబాహులనే రాక్షసులు యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి రాగ, రాముడు మారీచుడిపై 'శ్రీతేశువు' అనే అస్త్రాన్ని సంధించాడు. దీనితో మారీచుడు ఎగిరి, సముద్రంలో పడిపోయాడు.ఆగ్నేయాస్త్రంతో సుబాహుడిని సంహరించాడు శ్రీరాముడు ఇలా  రక్షాస సంహారం జరిగిన తర్వత మల్లి ప్రయాణాన్ని ప్రారంరంభించారు.విశ్వమిత్రుడు, రామలక్ష్మణులు. ఈసారి వారి ప్రయాణం జనకుని కొలువుకు. మార్గమధ్యంలో గంగా వృత్తాందాన్ని వివరించాడు విశ్వమిత్రుడు, గంగను భూమికి తీసుకొనివచ్చిన భగీరథుడు శ్రీరాముడి వల్ల శాప విమోచనం కలిగింది.

అటు తర్వాత మిథిలా నగరానికి చేరుకున్నారు. అక్కడి మహారాజు జనకుడు. అయన కూతురు సీత. తన దగ్గరున్న శివధనుస్సును ఎక్కుపెట్టగలవాడికే తన కూతురును ఇచ్చి వివాహం చేయిస్తానన్నాడు. జనకుడు .దీనితో విశ్వమిత్రుని ఆదేశం ప్రకారం శివధనుస్సును అవలీలగా ఎక్కువపెట్టాడు శ్రీరాముడు. శ్రీరాముని పరాక్రమానికి శివధనుస్సు ఫెళ్ళున విరిగింది. దీనితో సీతారాముల కళ్యాణం జరిగింది.జనకుడు తన సోదరుని కూతుళ్లను కూడా రాముని సోదరులకు ఇచ్చి వివాహం చేశాడు.దీనితో, సీతారాములతో బాటుగా, తన తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలయిన ఊర్మిళను లక్ష్మణునికి, మాండవిని భరతునికి,శ్రుతకీర్తిని శత్రుఘ్నునికి ఇచ్చి వివాహం జరిపించారు.

కన్నుల పండువగా జరిగిన ఈ వివాహానికి దశరథుడు పరివారంతో వచ్చాడు. వివాహం ముగిసిన తర్వాత విశ్వమిత్రుడు హిమాలయాలకు వెళ్లగా దశరథుడు కొడుకులను కోడండ్రను తీసుకొని తిరుగుముఖం పట్టదు.

మార్గమధ్యంలో పరశురాముడు తన దగ్గరున్న విశునిధనుస్సును ఎక్కుపెట్టమని సవాలు చేశాడు.రాముడు అవలీలగా ఎక్కుపెట్టగా పరశురాముడు ఓటమినంగీకరించి మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు.భారత శత్రుజ్ఞులు తాతగారి ఇంటికి వెళ్లగా రామలష్మణులు దశరథునితో అయోధ్య చేరుకున్నారు.

రామకథ ప్రారంభంతో మొదలైన బాలకాండ రాముడు కల్యాణ రాముడై అయోధ్యను చేరుకునే వరకు పూర్తవుతుంది.