Home SSC 10th Class తెలుగు వ్యాకరణం

తెలుగు వ్యాకరణం - భాషా భాగాలు

భాషా భాగాలు

తెలుగులో భాషా భాగములు ఐదు.

నామవాచకములు - మనుష్యుల పేర్లు, జంతువుల పేర్లు, ప్రదేశముల పేర్లు, వస్తువుల పేర్లు తెలియజేయు పదములు నామ వాచకములు. కృష్ణ, సీత, పాఠశాల.

సర్వనామములు - నామ వాచకములకు బదులుగా వాడబడునది - నువ్వు, మీరు,నేను,వాళ్ళు,వీరు

విశేషణములు - నామవాచకం యొక్క గుణములను తెలియజేయు పదములు విశేషణములు - నీలము, ఎరుపు, చేదు, పొడుగు.

క్రియలు - పనులన్నియు క్రియలు - చదువుట, తినుట, నడచుట.

అవ్యయములు - లింగ, వచన, విభక్తులు లేని పదములు అవ్యయములు - భలే, అక్కడ,అయ్యో,అమ్మో.